Monday, January 31, 2011

స్నేహం"

గాలి వీస్తే అరిపోఎది "దీపం"
రోజు గడిస్తే రాలిపోఎది "పుష్పం"
మెలుకువ వస్తే చేరిగిపోయ్ది "స్వప్నం"
బట్,
ప్రళయం వచ్చిన చెరగనిది
"స్నేహం"

Madhuramaina Telugu kavithalu

ప్రేమించటం నేరం కాదు,
ఆశించటం ధర్మం కాదు,
ప్రేమను తెలుపకపోవటం న్యాయం కాదు,
ప్రేమించిన ప్రేమను ప్రేమించి న్యాయం చేయకపోవటం అన్యాయం...

ప్రేమను ప్రేమించు ప్రేమకై
ప్రతినిత్యం ఆరాధించు ప్రతిమవై
ప్రేమకు పెళ్లి గమ్యం కారాదు,
పెళ్ళికి పునాది ప్రేమ కావాలి,
ప్రతీ కష్టసుఖలన్ని కలిసి అదిగమించాలి....


వోదిగితిని శాశ్వతంగా నీ హృదయంలో
తదిసితిని హాయిగా నీ శ్వాస జడివానలో
అనుకోలేదు ఎన్నడు ఈ సమయం వస్తుందని
అనుకున్నది జరగకపోయినా హాయినిస్తుంది ఎందుకో మరి
అనుకోకు ఎన్నడు ఈ హాయిని జారనిస్తానని....

ప్రేమ చాలా అందమైనది
ప్రేమ ఆలోచింప చేస్తుంది
ప్రేమ మోహాన్ని మరిపిస్తుంది
ప్రేమ తోడై నిలుస్తుంది
ప్రేమ కష్టసుఖాలను అదిగమిస్తుంది
ప్రేమ ఎడారిలో పూలు పూయిస్తుంది
ప్రేమే జీవితం, జీవితమే ప్రేమ.....


స్నేహం జీవితానికి అవసరం
ప్రేమ జీవితాన్నిస్తుంది

స్నేహం జీవితానికి అందమైన కానుక
ప్రేమ జీవితానికి అందమైన అదృష్టం

స్నేహం సుఖ దుఖాలను మరిపిస్తుంది
ప్రేమ సుఖ దుఖాలలో తోడుంటుంది

స్నేహం దూరాలను దగ్గర చేస్తుంది
ప్రేమ దూరాన్ని భరించలేదు

స్నేహం ఓదారుస్తుంది
ప్రేమ ఓదార్పును కోరుకుంటుంది

స్నేహం రంగుల ప్రపంచాన్ని పంచుతుంది
ప్రేమ రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది

స్నేహానికి బాద్యతలు లేవు కాని బందం వుంటుంది
ప్రేమ బాధ్యతలతో కూడుకున్న వింత అనుబంధం

స్నేహానికి గమ్యం లేదు
ప్రేమకు ప్రేమనే గమ్యం.....


ఎగిరిపోకు మిత్రమా దుదిపింజంలా
మార్చకు ప్రియతమా నను కాగితం పువ్వులా
చెరగనీయకు చిరునవ్వుల పలుకులు చిలిపి కోయిలా
వున్నంతలో పొండుదాము ఆనందము పగలే వెన్నెలలా...


హృదయం ఒక పద్మవ్యూహం
ప్రవేశించటం ఎంత కష్టమో ఛేదించి గెలవటం అంత కష్టం
హృదయం ఒక ప్రణయ కావ్యం
మొదలు పెట్టటం ఎంత ఇష్టమో ముగించటం అంత కష్టం....


పండువెన్నేలను పరిచే చంద్రుడు వస్తాడని
ఎదురుచూచుటలో ఉండును ఆనందం
కనుమరుగయ్యే అమావాస్య చంద్రుదికోసం
ఎద పరిచి రోదించినా కరుణించడు కదా....?!!
బాధ పడకు మనసా,
చిగురించును ఆశలు కాల గమనంలో
వస్తాడు పౌర్ణమి చంద్రుడు పండు వెన్నెలను పరుచుటకు....!!


పరుగెత్తెను మనసు అలుపెరుగక
ఎవరి కోసమే ఇంకెవరి కోసమే....???
పడాలి కాళ్ళకు బంధము
మునగాలి ఆనందపు సాగరంలో
పట్టు విడుపుల మద్య కొట్టుమిట్టాడకు ఓ మనసా....!!!

మౌనం ఎందుకు మనసా
తెలుసా నేను పడే వేదన
పూయించావు మనసులో వెన్నెల
కరుగుతుంది అది కన్నీటి కన్నుల


మనసులోని రాగం మౌనమైన వేల
మమతల జడి వాన కురిసినచో
అగుపించును ప్రపంచం సుందరంగా
తనకెవరుసాటి అని అనిపించునేల ఓ మనసా...????

ఏమిటి ఈ వింత జీవితం
ఎందుకు ఈ జీవన పోరాటం
తిరుతాము అందరిలో జీవితం ఉన్నత వరకు
మిగులుతాము ఒంటరిగా జీవిత కాలం ముగిసినంతన......

కవిని కాను నేను సామాన్యురాలిని
కవిత కాదు నా ముందున్న భవిత
కలుగును మదిలోన కమ్మని భావము
ఆ భావానికి మూలము నా మదిలోని రాగము
ధన్యురాలిని, ఈ జన్మకు నేను అదృష్టవంతురాలిని....!!!

నా కవిత నాకు సొంతం, అది నీకు అంకితం
నీ హృదయం నాకు సొంతం, నేను నీకు అంకితం
మౌన రాగం నీకు సొంతం, అది నాకు అంకితం
జీవన రాగం మనకు సొంతం, అది దేవుడికి అంకితం...!!!


నిదుర రాని క్షణాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి,
నిన్న మొన్నటి జ్ఞ్యాపకాలు గుర్తుకొస్తున్నాయి,
నీవు కనుమరుగైనా నను వీడనంటున్నాయి,
కుదరని క్షణాలు కలత చెందిస్తున్నాయి,
కలవరపెట్టి తీయని కళను దూరం చేస్తున్నాయి,
తప్పదు కదా అని సరిపెట్టుకుంటున్నాయి....

ఇష్టం లేని జీవితం మరణంతో సమానం,
కష్టమైనా ఇష్టపడే జీవితాన్ని కోరుకోవటం సహజం,
కష్ట సుఖాలతో కూడుకున్నది ఈ జీవన ప్రయాణం
విరహంలో కోరుకుంటాము మరణం
కాకూడదు అది తుది నిర్ణయం....

వడి వడిగా నడిచే కాలం ఆగదు
ఎగసి పడే కెరటం ఆగదు
పయనించే సెలయేరు ఆగదు
పడి లేచే పసిపాప పరిగెత్తక ఆగదు
నా గుండె చప్పుడు నీకు విన్పించక ఎలా ఆగును...??!!

సిరిమువ్వల సవ్వడి వినిపించును...
సెలయేటి గల గల వినిపించును...
కోకిల మధుర గానం వినిపించును...
నిదురరాని నా కనురెప్పల చప్పుడును,
నీకు ఎలా వినిపించను ఓ మనసా...??!!!


మధురమైన నా స్వప్నం నీ కోసం
మరలరాని ఈ జన్మ నీ కోసం
మరపురాని మన స్నేహం నీ కోసం
మెరుపులాంటి నా రూపం నీ కోసం
మనసులోని తీయని రాగం నీకోసం
మమతానురాగాల బంధం నీ కోసం
మరు జన్మ వుంటే పుడతాము మనం ఒకరి కోసం ఒకరం...!!!

నన్ను నన్నుగా నచ్చిన నువ్వే ఎప్పటికి నా నవ్వు,
కాదనలేను నేను, ఔననలేవు నువ్వు,
మదనపడే నాకు చిరునవ్వు తోడయ్యేను,
నువ్వు నువ్వుగా నను చేరే రోజున పసిడి పువ్వై పూసెదను...!!!


మదిలోన విరిసేను ముద్ద మందారం
పెదవులపై మురిసేను సిరిమల్లి సింగారం,
కనులలో కదలాడెను కన్నె కనకాంబరం,
తనువున మెరిసేను పచ్చటి బంగారం,
తీయటి తలపుల కొలువు మనసే మందిరం....

జీవితం ఒక తెల్ల కగితమైతే
కాకూడదు ప్రేమ ఒక నల్ల చుక్క
కావాలి ఆ చుక్క ఒక మల్లె మొగ్గ
విరపూసి వెదజల్లాలి చక్కటి సువాసన
విహరించాలి ఆకాశ వీధిలో పరిమళ పుస్తకమై...!!!



కవితకే ఒక కవిత కావాలని కోరుకునే కవి కాని కవిని కలవాలని

కలకాలం కోరుకుని కలలో నివసిస్తూ కాలం కడలిలో కలిసిపోవుటకు సిద్దమైన

కవి కాని కవయిత్రిని నేను కలవరపడుతున్నా కనికరం లేకపోవటం ఎంత దురదృష్టకరం......


మదిలోని ఆశలకు మాటలు వస్తే,

తీయనైన పాటలతో రాతినైన కరిగించునేమో కదా....!!!!


ఆశల కడలిలో ఉసులాడే మనసుకు,

అలుపెరుగని తోడు దొరికితే,

ఉరకలు వేయదా పరువము ఆనంద కేరింతలతో...!!!


సూర్యుడిని చూడలేము ప్రకశించునప్పుడు,

ఎందుకు కనపడును సుందరముగా సూర్యుడు సుర్యాస్తమయమున,

వెళ్లి పోతాడు అని తెలిసి ఎందుకు ఈ పులకింత.....???!!



మనసా ఎందుకు ఈ ఆనందం, ఆరాటం,

ఏమిటి ఈ తెలియని అమాయకత్వం,

ఏ మదికి అర్థమగునో నీ మనస్తత్వం....


మనసా ప్రేమంటే తెలుసుకో,

జీవితాన్ని ఆనందంగా మలుచుకో,

మదిలోని భావనలను అర్థం చేసుకో,

నీకు నచ్చిన వారి హృదయాన నిలిచిపో,

నీ మది మేచిన వారి ప్రేమను ఎప్పటికైనా అందుకో....!!



కలిసెను కవి హృదయాలు,
మెరిసేను ఆకాశము,
మురిసేను మనసు,
తేలియాడెను గాలిలో అది పెనుగాలి అని కూడా మరచి.....


ఎవరు నీవు?? నాకు ఎలా దొరికావు?? ఎందుకు దొరికావు??

ఏమిటి మన మద్యవున్న బంధము??

మనము ప్రేమికులమా, కామికులమా, పనికి రాని పోకిరీలమా?

ఏమనుకోవాలి????

అన్నింటిలో శాశ్వత బందానికే నా ఓటు.

అందులో మొదటిది 'స్నేహ బంధము'.......



మనసా తెలుసుకోలేవా మదిలో ఉన్న తీయని ఆశలను,
చిరుదరహాసము వెనక ఉన్నవెచ్చటి ఆశ్రువులను,
వేదనల వెనక ఉన్న రోదనలను,
తెలిపేది ఎలా నీకు అటు ఇటు కాని ఓ మనసా...??!!


జీవితంలో విరపూయును పువ్వులు ఎన్నో,
కావు కదా అన్నీప్రేమ కుసుమాలు,
కనుక్కోవాలి వాటి జాడలను,
జారనీయకూడదు జవరాల నవ్వుల పువ్వులను,
కావాలి జీవిత పయనము ఆనందపు జల్లుల జడివానలో నిండు నూరేళ్ళు,
ఇందులో సఫలీకృతులు అవుదురు అందరిలో కొందరు....!!!!


అలిసితిని సోలసితిని,
అనురాగ మాలాలలు అల్లితిని,
ప్రణయ భావాలు పలికితిని,
పైర గాలిలా సాగితిని,
పండుటాకుగా మిగిలితిని,
రాలిపోవుటకు సిద్దముగా వుంటిని కాలం కాకున్నా...
ఇక ఆశలెందుకు రాలిపోయే ఈ ఆకు మీద...???!!


కంటికి కనపడవు కనులారా చూద్దామంటే,
కమ్మటి కలలలో కడులుతావు మేడులుతావు,
ఊహల ఊయలలో ఊగుతూ మురిపిస్తావు,
మౌన సామ్రాజ్యాన్ని ఎలుతావు ఎదను గిల్లుతావు,
కాదిది నీకు న్యాయము ఓ మనసా నీకు తెలుసా
తీయటి భావన తెలుపలేని ఆరాధన..??!!



నన్ను నేను మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేను అద్దంలో చూచుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు,
నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను బాదిన్చినపుడు..
నాకు నేను శిక్ష విధించుకుంటాను
నేరం నావలన జరిగినప్పుడు..
నా మనసును నేను లేక్కచేయ్యను
అది తప్పు అని నాకు తోచినప్పుడు


నా కవితకు ప్రేరణ నీవు
కావు ఎన్నటికి వేదన నాకు
నా కంటి తీయటి కలవి నీవు
దాహాన్ని తీర్చలేని కన్నీరువు కావు
ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు
నా జీవితానికి ఆశవు నీవు
మరణానికి ఎన్నడు మూలం కావు
వలపులవోడిలో నేను ఒంటరిని,

మనం మనుషులం, సంఘజీవులం
ఆత్మలం పరమాత్మలం కాము
ఆదేశించలేము ఆత్మగా
భోధించలేము పరమాత్మగా
గౌరవించాలి మన సంస్కృతిని
ఆదర్శంగా నిలవాలి కొత్త తరానికి...


బాధపడకు నేస్తమా నేనున్నాను,
దూరాన వున్నా మనసుకు తోడున్నాను
కలకాలం వుండవు కష్టాలు కన్నీళ్లు
కలవరపడి తడబడకు కాదు ఏది శాశ్వతము,
కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అనుక్షణము...


నా కవితకు రూపానివి నీవు
తొలకరి జల్లు సువాసనవి నీవు
మమతానురాగాల బంధువు నీవు
సడి చెయ్యని మువ్వవు నీవు
మనసుకు వేసిన విడతీయరాని ముడివి నీవు
సదా ఆనందంగా వుండాలి నీ నవ్వు...

వలపులవోడిలో నేను ఒంటరిని,

నా తలపులలో నీవు తుంటరివి,

రేయి పగలు అని చూడక వలచి వచ్చిన సొగసరివి,

పట్టు వదలని నను మించిన గడసరివి...



విరపూసిన ప్రతి పుష్పము గర్వపడును చేరిన దేవుడి చెంత,
అలంకారమై మురిసి తరించి వీడును చింత,
ఆనందమయమై అందము విరచిమ్మి పొందును గిలిగింత,
వాడిపోతూ కూడా పరిమళాన్ని మిగిల్చటం ఒక వింత.....



కాలం కడలిలో కలిసిపోయే జీవితమ ఎందుకు నీకు ఈ జన్మ...
సాధించాలి అనుకుంటావు అన్ని చేఇవారికి సాదిన్చేదమిటి...
చీకటి వెలుగుల మద్య సాగిపోతు అవసరమా నీకు ఇన్ని విన్యాసాలు...
కాదేందుకు భూతలస్వర్గము జన్మమెత్తిన ప్రతీ జీవికి..
అదృష్టం దురద్రుస్తంతో కూడిన అలుపెరుగని ఈ పోరాటం ఎందుకు నీకెందుకు..?


ప్రేమ ఒక తీయటి స్వార్థం,
కావాలి అనుకుంటుంది అన్ని తన సొంతం,
కాకపోతే ఎక్కుతుంది బలిపీటం..

ప్రేమ ఒక తీయటి త్యాగం,
పంచుతుంది లేదనక తన సర్వస్వం
చేస్తుంది జీవితంతో మౌనపోరాటం...

ప్రేమ ఒక తీయటి కలల కావ్యం
చూపిస్తుంది తన మధుర ప్రపంచం
నిజమవ్వాలి అనుకుంటుంది ప్రతీ క్షణం.....




పయనించే గాలికి తెలుసా చీకటి వెలుగు,
పరిమళించే పువ్వుకు తెలుసా మంచి చెడు,
గల గల పారే సెలఎరుకు తెలుసా ఎత్తు వంపులు,
మురిపాలోలికే పసిపాపకు తెలుసా ధనిక పేద,
అందరిలో తిరిగే మనిషికి ఎందుకు ఈ కట్టుబాట్లు..??!!



గమ్యం లేని ఎడారిలా సాగిపోతున్న జీవితంలో
దొరికావు నాకు ఒక ఒయాసిస్ లా ,
సేదదీరుతున్నాను అది గమ్యం కాదని తెలిసి
సాగానంపకు నన్ను నీ గమ్యాన్ని వెతుక్కోమని..


తొలకరి వలపుల ఎద పొంగెను మమతల జడివానలో
వెళ్లి విరిసేను జాజిమల్లి అనురాగ తోటలో
కోయిల మధుర రాగాలు పలికెను మది లోగిళ్ళలో
గల గల పారెను సెలయేరై ఆనంద జీవన గమనంలో RAJ

Preme Jivitham

ప్రతే మసిన్షి జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే...కానీ నా జీతంలో ప్రేమే జీవితం,

ఒక అమ్మ నన్ను నవ మాసాలు మోసి కానీ పెంచింది,

మరో అమ్మ నాకు ఎలా బ్రతకలు నేర్పింది ,ఆ అమ్మే నాకు జివితన్నికి అర్దెం చెప్పింది....

ఎద గుదేలో ఒక దేవత ,నా మధురమైన కాలాలకు రాణి అ "అమ్మ"

చిన్న నాటి నా ప్రేమ ఒక ఆకర్ష్నేమో అనుకునా

నాతో పాటే ఆ ఆకర్షణ పెరిగి ప్రేమ గ మారింది

ఆ ప్రేమే ఇప్పుడు నా ప్రాణం కన్నా మేన్నగా మారింది......

నా జివ్తనే ప్రేమ మాయం చేసింది, నలుగురికి సయం అందించే గుణం ఇచ్చింది ,

నా జీవితానికి అర్ధం, పరమార్ధం చూపింది............

ఇప్పటికి ఆప్రేమ కోసెం ,ఆ ప్రేమ లోనే జీవిస్తున్న.....

ప్రేమ స్వార్ధం లేనిదే ,ప్రేమ ఎప్పటికి ఊదిపొందీ

......ప్రేమించే ప్రతే మనసుకే నా జీవతం ఒక ఆదర్శం కావలె ....

ప్రేమించే ప్రతే మనిషి ఆ ప్రేమ లోనే సంతోసెం గా జీవితాంతం గడపాలని

ఆశిస్తూ...........................................మేఎ '"రాజ్"